
జనం న్యూస్ సెప్టెంబర్ 29 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండలం గుత్తెన దీవి గ్రామం సాయిరాం విద్యానికేతన్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గుత్తెనదీవి ఉప మండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, స్థానిక సర్పంచ్ లంకలపల్లి దుర్గాదేవి మునిరాజు అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కాషాయ ధ్వజానికి పూజలు నిర్వహించి గౌరవ నమస్కారం చేశారు. అనంతరం దుర్గాదేవి, భారతమాత,మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ గురుజి,డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చిత్రపటాలకు పూలమాలలు అర్పించి పూజలు చేశారు. రాజమండ్రి నుంచి ప్రాంత ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సభ్యులు ఓలేటి సత్యనారాయణ ముఖ్య వక్తగా హాజరయ్యి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు,100 సంవత్సరాల శతజయంతి ఉత్సవాలు గురించి వివరిస్తూ దేశ పునర్ వైభవం కోసం హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ వ్యక్తి నిర్మాణము ద్వారా అహర్నిశలు కృషి చేస్తూ సమాజంలో దేశభక్తి భావనను నిర్మాణం చేస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ విజయదశమికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. 1925లో సంఘము ప్రారంభించి డాక్టర్జీ దీని కోసం ఒక అద్భుతమైన శాఖా కార్య పద్ధతిని అందించి అన్ని రంగాల్లో దేశభక్తి నిర్మాణం చేస్తూ దేశ సేవలో నిమగ్నమైంది. విజయదశమి ఉత్సవం సందర్భంగా హిందూ సమాజాన్ని సంఘటిత పరిచి పంచ పరివర్తన కోసం ఈ సమావేశం, ఏర్పాటు చేయబడింది అని మాట్లాడారు.ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖ రం మాట్లాడుతూ సంక్షోభం సమయంలో దేశానికి సేవ చేయగల, సమాజంలో మంచి మానవులుగా జీవించగలిగే ఆరోగ్యకరమైన, సంస్కారవంతులైన వాలంటీర్లను తయారు చేయడమే లక్ష్యంగా , ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారి స్వచ్ఛంద సేవలు అన్ని విభాగాల నుండి ప్రశంసలు పొందాయి అన్నారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం ఖండ సంఘచాలక్ పెన్మత్స గోపాలకృష్ణంరాజు, సొసైటీ అధ్యక్షులు పెంటా రవి ప్రసాద్, నరహరిశెట్టి రాంబాబు, మండల సాగునీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ ఉపాధ్యక్షులు చోడిశెట్టి నాగబాబు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు మద్ధింశెట్టి పురుషోత్తం, రెల్లు గంగాధరం, అల్లూరి శ్రీను రాజు, సలాది రాజా,గుత్తినదీవి ఉప మండల ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అల్లూరి వెంకట రామకృష్ణారాజు, చోడిశెట్టి రమేష్,మల్లాడి శ్రీను, గుత్తినదీవి ,జి వేమవరం, ఎదురులంక, జి. మూలపాలం గ్రామాల ప్రముఖులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
