
జనంన్యూస్. 29.నిజామాబాదు. ప్రతినిధి.
నిజామాబాదు. శ్రద్ధానంద్ కొత్త గంజ్ లో నిర్వహించిన మహా అన్నదానం & పూజ కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ గారు. పాల్గొనడం జరిగింది.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు దుర్గా దేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయం పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో దసరా పండగ జరుపుకోవడం జరుగుతుందని అన్నారు.దుర్గ దేవి విజయానికి గుర్తుగా ప్రజలంతా దేవి నవరాత్రులను భక్తి శ్రద్దలతో నిర్వహిస్తూ ఒక్కో రోజు, ఒక్కో రూపంలో అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శనం ఇవ్వడం ప్రతేకం అన్నారు.హిందూ ధర్మాన్ని ప్రపంచానికి చాటి చెప్పేవిదంగా ఇందూర్ నగరంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభోవంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలలో బతుకమ్మకు, దసరాకు ప్రత్యేక స్థానం ఉందన్నారు.అమ్మ ఆశీర్వాదంతో ఇందూర్ జిల్లా ప్రజలందరు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు.అనంతరం భవాని స్వాములకు ఎమ్మెల్యే స్వయంగా అన్నప్రాసదములు వడ్డీంచడం జరిగింది.ఈ కార్యక్రమంలో భవాని స్వాములు & భక్తులు మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కమల్ కిషోర్, సెక్రటరీ జ్ మల్లేష్, సళదారులు మాస్టర్ శంకర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగోళ్ళ లక్ష్మి నారాయణ, బీజేపీ నాయకులు మండల అధ్యక్షులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
