
జనం న్యూస్ సెప్టెంబర్ 29 కూకట్పల్లి ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటిగా ప్రజా సంక్షేమ పథకాలను హామీలను వాగ్దానాలను అమలు చేసుకుంటూ వస్తున్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం.దళితులు గిరిజనులు మైనార్టీలు వెనకబడిన తరగతుల ప్రజల క్షేమం సంక్షేమం కోరే ఏకైక పార్టీ మన కాంగ్రెస్ పార్టీ.ఇందిరమ్మ ఆశయాలను రాజీవ్ గాంధీ ఆలోచనలను సోనియమ్మ సూచనలను రాహుల్ గాంధీ మార్గదర్శకాలను ఆచరిస్తూ బిసి ప్రజలంతా ఎన్నో ఏండ్ల నుండి ఎదురు చూస్తున్న 42 శాతం రిజర్వేషన్లు ప్రతిపక్షాలు దాన్ని అమలుకు నోచుకోకుండా ఎన్ని అడ్డంకులు సృష్టించినా న్యాయ పరంగా ఎన్ని అవరోధాలు ఎదురైనా అన్నిటిని ఎదుర్కొని మన రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటకు కట్టుబడి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం జీఓ జారీ చేసిన సందర్భంగా ఈ రోజు ఉదయం కూకట్పల్లి నియోజకవర్గంలో గల మూసాపేట్ డివిజన్ లోని గ్రేటర్ హైదరాబాద్ పురపాలక సంస్థ కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ బండి రమేష్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం అని. ప్రజల శ్రేయస్సు కోసం ఎల్లప్పుడూ తపించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో తూము వేణు, తూము సంతోష్, గోపిశెట్టి రాఘవేందర్, బాకీ, సలీం, మధు, నయీమ్, నరసింహ యాదవ్, తోటరాజు, చున్నుపాష, సచిన్, తోటరాజు ,కల్పన ,జోజమ్మ, సంధ్య, కర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
