
పూలనే దేవుళ్లుగా కొలిచే పండగ బతుకమ్మ.పండగ
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ
ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగను జరుపుకుంటారు
జనం న్యూస్,సెప్టెంబర్ 29,కంగ్టి,
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామంలో సోమవారం అంబరానంటిన సద్దుల బతుకమ్మ సంబరాలు. తిరొక్క పువ్వులతో సద్దుల బతుకమ్మ పేర్చి ఆడి పాడిన అమ్మలు అక్కలు,ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బతుకమ్మ పేరు బృహదమ్మ,నుంచి వచ్చినదే.బతుకమ్మ సందర్భంగా గౌరమ్మను పసుపు రంగు పూలతో పేర్చి తొమ్మిది రోజుల పాటు ఆటపాటలాడి పూలను నీటిలో వదులుతారు.శివుడు లేని పార్వతి గురించి పాటలగా పాడుతూ బతుకమ్మను జరుపుకుంటారు. తెలంగాణ వాసులు. బతుకమ్మ పండుగ ప్రకృతిని అరాధించే పెద్ద పండుగ.పూలనే దేవుళ్లుగా కొలిచే పండగ బతుకమ్మ.తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ నిలుస్తోంది.ప్రతి ఏడాది భాద్రపద అమావాస్య మొదలు ఆశ్వియుజ శుక్ల అష్టమి వరకు తొమ్మిది రోజులు ఈ పండుగను జరుపుకుంటారు.రాష్ట్ర ప్రజలు తమ ఇళ్లలో పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను. ఒకచోట చేర్చి చుట్టూ తిరుగుతూ చప్పట్లు కొడుతూ.పాటలు పాడుతూ ఆడారు.