
జనం న్యూస్ 29 సెప్టెంబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
గద్వాల జిల్లా కేంద్రంలో మద్యం మత్తలో వరుస దాడులు..పోలీసులు బలంగా కేసులు చేస్తున్న యువతలో రానీ మార్పు…ఇకపై దాడులు ఇలాగే కొనసాగితే ఇంక కఠినంగా కేసులు చేసే యోచనలో పోలీసులు..
గద్వాల: నిన్నరాత్రి తప్పాతాగి పానీ పూరి బండి ధ్వంసం చేసి యజమానిపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు విచారణ వేగవంతం చేశారు..దాడీ చేసిన వారిలో ముగ్గురు నిందితులు ఉన్నట్లు తెలిస్తుంది..నేడు సంఘటన స్థలానికి పట్టణ ఎస్ఐ కల్యాణ్ కుమార్ వెళ్లి వివరాలు సేకరించారు..నిందితులు ఎంతటివారైన వారిపై పోలీస్ శాఖ తరపున కఠిన చర్యలుంటాయని ఆయన తెలపారు..గత కొన్నిరోజులుగా గద్వాల పట్టణంలో యవత మద్యం మత్తులో వరుస దాడులు చేసుకుంటున్న సందర్భంలో పోలీస్ శాఖ కూడ సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది..ఇలాంటి దాడులు చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నప్పటికి యువతలో మార్పు రాకపోవడంతో ఇకపై దాడులు చేసేవారిపై పోలీసులు కూడ బలమైన కేసులు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది….