
జనం న్యూస్ సెప్టెంబర్ 30 ముమ్మిడివరం ప్రతినిధి
శ్రీదేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 9వ రోజు గా కాట్రేనికోన గ్రామ దేవత దుర్గాష్టమి పండుగ సందర్భంగా గారెల అలంకరణలో శ్రీ దుర్గా దేవిగాశ్రీ మావుళ్ళమ్మ తల్లి దర్శనమిచ్చారు.బ్రహ్మశ్రీ ఆణి విళ్ళ ఫణికాంత్ శాస్త్రి ఆధ్వర్యంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించారు.తొలుత వినాయకుని పూజ, అమ్మవారి సంకల్పం, అష్టోత్తర పూజా కార్యక్రమం, కుంకుమార్చన, నీరాజనం మంత్రపుష్పాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు ఆణివిల్ల సాయిబాబా, గ్రంధి నారాయణమూర్తి, గ్రంధి రాంప్రసాద్, గ్రంధి నానాజీ, సంసాని వరప్రసాద్, య ల్లమిల్లి రమేష్, సుంకరపవిత్ర, బుజ్జి, చెరుకు కృష్ణ, చెరుకు బాపిరాజు, గ్రంధి శ్రీను, తాతపూడి గోపి, పలువురుమహిళలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి గారెలు ప్రసాదమును స్వీకరించారు