
జనం న్యూస్- సెప్టెంబర్ 30- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్-
నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ మెయిన్ బజార్ లో బిఆర్ఎస్ పార్టీ నాయకుడు రమేష్ జి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీను నాయక్ టౌన్ ఎస్ఐ ముత్తయ్య లు ముఖ్య అతిథులుగా విచ్చేసి పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని ఆడపడుచులు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. రంగురంగుల పూలను పేర్చి బతుకమ్మలను తయారుచేసి ఆడపడుచులందరూ తమ తమ బతుకమ్మలను అందంగా అలంకరించి ఒక చోట చేర్చి పూజలు చేసి సాంప్రదాయ పాటలు పాడుతూ బతుకమ్మలను కొలిచారు. అనంతరం బతుకమ్మలను కృష్ణానదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సఫవత్ చంద్రమౌళి నాయక్, నరసింహారావు, మాయ కోటి వినోద్, మాయకోటి శంకర్, మంజుల జనార్ధన్, ఉద్యమకారుల ఫోరం నాయకురాలు జానకి రెడ్డి, విజయ, రాధిక భాయ్, అంజమ్మ, కళమ్మ, చైతన్య, లలితా బాయ్, కవిత, పద్మ, రూపభాయ్, మంజుల ధనలక్ష్మి ,విజయ, రాధ, స్వరూప, వినోద, అరుణ, నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాగార్జునసాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శీను నాయక్ ఆధ్వర్యంలో ఎస్సై ముత్తయ్య తన సిబ్బందితో కార్యక్రమానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా తన సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు.