
దుర్గామాత విగ్రహ దాతను సన్మానించిన బబ్బూరు రాందాస్ గౌడ్
జనం న్యూస్, సెప్టెంబర్ 30, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు మంగళవారం అమ్మవారిని దర్శించుకున్న బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు బబ్బురి రాందాస్ గౌడ్, ఈ సందర్భంగా విగ్రహ దాత కొంతం కనకరాజు ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు, ఈ సందర్భంగా రాందాస్ గౌడ్ మాట్లాడుతూ అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని చేబర్తి లో ఘనంగా శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభిందనీయం అని యువత దైవభక్తి కలిగి ఉండాలని కోరుకుంటూ అమ్మ దయతో అందరూ బాగుండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు, ఈ కార్యక్రమంలో పద్మాకర్ రావు, నాయకులు బబ్బూరి రాములు గౌడ్,బబ్బూరి నర్సింలు,చిన్ని కృష్ణ,భాను, మహేష్,నాగరాజు,ఉత్సవ కమిటీ సభ్యులు,గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.