
జనం న్యూస్ సెప్టెంబర్(30) సూర్యాపేట జిల్లా
తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండల కేంద్రంలో మంగళవారం నాడు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రజాక్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి కార్యకర్తలతో మాట్లాడుతూ ఎంపీటీసీ,సర్పంచ్ ఎన్నికలలో మండలంలోని అన్ని గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిచే విధంగా ప్రతి కార్యకర్త పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశాడు. అదేవిధంగా జడ్పిటిసి స్థానాన్ని కూడా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిచే విధంగా అందరూ కృషి చేసి గెలిపించాలని కోరాడు.ఈ సమావేశానికి మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.