
జనం న్యూస్ అక్టోబర్ 1 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండల కేంద్రంలోని సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా మహిళలు ఆటపాటలతో సద్దుల బతుకమ్మను పండుగను జరుపుకున్నారు బతుకమ్మ సంబరాలలో భాగంగా బతుకమ్మ చెరువు వద్ద వేడుకలు వైభవంగా జరిగాయి . ఈ వేడుకలలో భాగంగా మండల కేంద్ర పెద్దలు బతుకమ్మ పెద్దగా, అలంకరణగా చేసినవారికి బహుమతులు ప్రకటించారు మొదటి బహుమతిగా చిన్నబోయిన సరోజన కు రెండో బహుమతి, దాసరి సంధ్య మూడో బహుమతి నాలిక విజయ గెలిచారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు విజేతలకు పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్, (బుజ్జి అన్న) గ్రామ పెద్దలు జిన్నా ప్రతాప్ సేనా రెడ్డి, శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయం చైర్మన్ సామల బిక్షపతి కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షుడు మారపల్లి కట్టయ్య, మండల నాయకులు రంగు బాబు, ప్రభాకర్ బుర లక్ష్మీనారాయణ బహుమతులు అందజేశారు. ఈ సద్దుల బతుకమ్మ కార్యక్రమంలో మహిళలు పిల్లలు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు……