
కొత్తగూడెం, అక్టోబర్ 1 (జనంన్యూస్):
విజయదశమి సందర్భంగా విశ్వమానవాళి శాంతి, క్షేమం కోసం కురిమెల్ల శంకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కనకదుర్గ అమ్మవారి సన్నిధిలో జరిగిన ఈ పూజల్లో ప్రపంచంలోని మనుషులందరూ ఆరోగ్యవంతంగా, సుఖసంతోషాలతో జీవించాలని, మతాల మధ్య వైరం తొలగి సౌభ్రాతృత్వం నెలకొనాలని ఆయన ప్రార్థనలు చేశారు.ప్రకృతి దోహదంతో మానవాళి క్షేమం సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేసిన కురిమెల్ల శంకర్, సమాజంలో శాంతి, ఐక్యత, మానవతా విలువలు నిలబెట్టడమే తన సంకల్పమని పేర్కొన్నారు.ఈ పూజా కార్యక్రమంలో ఆయన ధర్మపత్ని విజయలక్ష్మి, సంతానం సిరి, సింధు, కనకమ్మ పాల్గొన్నారు. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ ప్రత్యేక పూజలు స్థానికంగా విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి.