
జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జీఎస్టీ సంస్కరణల డోర్ టు డోర్ క్యాంపెయిన్ లో పాల్గొన్న ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు , ఎంపీ గంటి హరీష్ మాధుర్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ మాజీ మంత్రివర్యులు చిక్కాల రామచంద్ర రావు మాజీ శాసనసభ్యులు వివేకానంద గుత్తులు సాయి, చెల్లు అశోక్, దాట్ల పృధ్వీరాజ్ తదితరులు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హాజరయ్యారు.ఈరోజు ఐపోలవరం మండలం ఎదుర్లంక గ్రామంలో జరిగిన జీఎస్టీ సంస్కరణల డోర్ టు డోర్ క్యాంపెన్లో ప్రభుత్వ విప్ మరియు ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం చరిత్రలో నిలిచే విధంగా జిఎస్టి సంస్కరణ చేపట్టిందని దీని ద్వారా వ్యవసాయ యంత్రాలు పరికరాలపై జీఎస్టీని 12% నుంచి 5%కి తగ్గించిన ప్రధానమంత్రి నిర్ణయం రైతులకు పెద్ద ఉపశమనం కలిగిందని తెలియచేశారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు అభిమానులు ప్రజలు మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
