
జనం న్యూస్, తేదీ.1-10-2025, హయత్ నగర్ రిపోర్టర్
ఆలంపల్లి దుర్గయ్యరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని
కార్యాలయం ఏర్పాటు
రంగారెడ్డి జిల్లా పోల్కంపల్లి గ్రామంలో పేద ప్రజల ఆర్థిక, సామాజిక సమస్యలకు అండగా నిలవాలనే సంకల్పంతో *జీఎంజీ ఫౌండేషన్* కార్యాలయం త్వరలో ప్రారంభం కానుంది. ఈ ఫౌండేషన్ను తన స్వంత ఖర్చులతో ఏర్పాటు చేస్తున్నట్లు ఫౌండేషన్ ఛైర్మన్ గుండ్ల జంగం గౌడ్ వెల్లడించారు.గతంలో తాను అన్యాయాలను ఎదుర్కొన్న సమయంలో ఎవరి నుంచి డబ్బు సాయం గానీ, మాట సాయం గానీ లభించకపోవడంతో, ఆ అనుభవమే పేదలకు తోడ్పాటుగా నిలవాలన్న తపన కలిగించిందని ఆయన తెలిపారు.“ఈ ఫౌండేషన్ను రాజకీయ ప్రయోజనాల కోసం కాదు, ఎన్నికల కోసం కాదు. పేద ప్రజల పట్ల ఉన్న సానుభూతి, అనుభవాలనే ఆధారంగా స్థాపిస్తున్నాం. రాబోయే రోజుల్లో పేదల కోసం తాగునీటి సదుపాయాలు, ఆవశ్యకమైన సహాయ సహకారాలు అందించేందుకు జీఎంజీ ఫౌండేషన్ అండగా ఉంటుంది” అని గుండ్ల జంగం గౌడ్ స్పష్టం చేశారు.