
జనం న్యూస్ ;1 అక్టోబర్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్;
అమ్మ అమ్మ నీరూపం నీరూపం. అంటూ దుర్గమ్మ నవరాత్రి అవతారాలపై కవి, దుర్గమ్మ నవరాత్రి అవతారాలపై రచయిత ఉండ్రాళ్ళ రాజేశం రాసిన దుర్గమ్మ పాటను ఎస్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్, జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఎన్నవెళ్ళి రాజమౌళి లు సిద్దిపేట నాసర్ పుర సహరా యూత్ ఆధ్వర్యంలో బుధవారం ఆవిష్కరణ చేశారు. యస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్ మాట్లాడుతూ దుర్గమ్మ నవరాత్రుల విశిష్టత తెలిపే దుర్గమ్మ పాట రాసిన రాజేశం కు అభినందనలు తెలిపారు. తెలుగు సాహిత్యంలో కృషి చేస్తున్న సిద్దిపేట రచయితలకు అభినందనలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో భాషా శ్రీకాంత్, వరుకోలు లక్ష్మయ్య, దాసరి రాజు, బత్తుల రాములు, ఆవుల రాజు, బైరి శంకర్, ఉండ్రాళ్ల తిరుపతి, నరేష్ తదితరులు పాల్గొన్నారు.