
సుప్రసిద్ధ చిత్రకారులు రుస్తుం
జనం న్యూస్: 1 అక్టోబర్ బుధవారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జ్ వై. రమేష్;
దసరా విజయదశమి పండుగను పురస్కరించుకుని నేడు రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో బుధవారం 'దసరా విజయోస్తూ' చిత్రాన్ని అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా అందరికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, పండుగలు సంస్కృతుల పునరేకీకరణలు, పునరుత్తేజాలు మనుషుల అంతరంగాలను జీవితాలను సమాజలను కళావంతం చేస్తాయని అన్నారు. దసరా పండుగ పనిముట్లకు యంత్రాలకు ఆయుధపూజలు నిర్వహించి పని దిగ్విజయానికి పునరంకితం ఐతారని, పంటచేన్లను చుట్టుముట్టి పాలపిట్టను చూచి, చప్పట్లు కొట్టి మచ్చుకు కొన్ని కొత్త ధాన్యాన్ని తెచ్చుకుంటారని, కొత్తబట్టలు తొడుక్కోని కొత్త అల్లుళ్ళ మురిపాలతో అందరితో జంబీ ఆకు ఇస్తూ అలై బలై తీసుకొని ఆనందాలతో దసరా శుభాకాంక్షలు తెలుపుకుంటారని మానవతా చిత్రకారులు రుస్తుం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎఫ్ అధ్యక్షురాలు జులేఖరుస్తుం, సర్జన్ వంశీకృష్ణ, తౌసిఫ్, బాలకృష్ణారెడ్డి నైరూప్య చిత్రకారుడు నహీంరుస్తుం, అసిస్టెంట్ ప్రొఫెసర్ రుబీనారుస్తుం, సాధిక్ మహ్మద్ రహీం తదితరులు పాల్గొని అందరికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.