
జనం న్యూస్ అక్టోబర్ 1 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
దసరా పండగ సందర్బంగా ప్రజలు, నేతలు, కార్యకర్తలు, హింధుబంధువులకు విజయయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు బీజేపీ నేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త డాక్టర్, ఏలూరి రాంచంద్రారెడ్డి.. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. శుభప్రదమైన విజయదశమి.. చెడుపై మంచిది సాధించిన విజయానికి ప్రతీక. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సానుకూలత తీసుకురావాలని, శాంతి, సమృద్ధి, సౌభ్రాతృత్వం పెంపొందించాలన్నదే దసరా సందేశం అని పేర్కొన్నారు. అలాగే దసరా పండుగలో శక్తి ఆరాధనకు ఉన్న ప్రాధాన్యతను ప్రస్తావిస్తూ, తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది అవతారాలను భక్తులు దర్శించుకుంటారని, ఇది భారతీయ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన అంశమని పేర్కొన్నారు. దేవతా శక్తులను ఆరాధించే ఈ దసరా పర్వదినం, మనల్ని సానుకూల దిశలో నడిపించాలని డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అభిలషించారు.