
(జనం న్యూస్, చంటి అక్టోబర్ 01)
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ముత్యంపేట లో బుధవారం సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించారు. సందర్బంగా మాట్లాడుతు మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమైన సంబురాలు 9వ రోజున సద్దుల బతుకమ్మతో ముగుస్తున్నాయి. ఇప్పటికే ఎనిమిది రోజుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు.ఎంగిలిపువ్వు బతుకమ్మ,అటుకల బతుకమ్మ,ముద్దపప్పు బతుకమ్మ,సానబియ్యం బతుకమ్మ,అట్ల బతుకమ్మ,అలిగిన బతుకమ్మ,వేపకాయల బతుకమ్మ,వెన్నముద్దల బతుకమ్మలతో,ఈ ఎనిమిది రోజులు వేడుకల్ని ఘనంగా నిర్వహించి,9వ రోజు ఆఖరి రోజున సద్దుల బతుకమ్మ'ను ఆరాధిస్తామని అన్నారు. ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరిస్తామని అన్నారు. అమ్మలు అక్కలు,తమ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ,పండుగను ఘనంగా జరుపుకుంటామని అన్నారు.పెద్ద బతుకమ్మ పక్కన చిన్నగా గౌరమ్మ'ను పసుపుతో తయారుచేసి,ఆ గౌరమ్మను పూజించిన తర్వాత,ఆ పసుపును తీసి ఆడపడుచులు వారి చెంపలకు రాసుకుంటారు. అమ్మవారికి ఐదురకాల నైవేద్యాలు తయారుచేసి సాయంత్రం ఆడపడుచులు అందరూ చక్కగా దుస్తులు,ఆభరణాలు ధరించి బతుకమ్మను తమ ఇంటి వాకిలిలో ఉంచి,చుట్టుపక్కల మహిళలంతా చేరి ఐక్యతతో ప్రేమను కలపి చుట్టు నిలబడి పాటలు పాడుదామని అన్నారు. జానపద గీతాలు చుట్టు పక్కలా ప్రతిధ్వనిస్తూ ప్రత్యేకమైన తెలంగాణా సంస్కృతిని ఆవిష్కరిస్తాయి అని అన్నారు.సూర్యుడు అస్తమించిన తర్వాత ఆడపడుచులు ఈ బతుకమ్మలను తలపై పెట్టుకుని గ్రామానికి దగ్గరలో ఉన్న చెరువుకు ఊరేగింపుగా బయలుదేరి అక్కడ మెల్లగా బతుకమ్మలను పాటలు పాడుతూ, ఆడుతూ నీటిలో జారవిడుస్తామనిఆన్నారు.
