కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ
జనం న్యూస్ జనవరి 29 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ప్రజా యుద్ధ నౌక గద్దర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నారాయణ ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రజా యుద్ధం ఒక గద్దర్ పై దిగజారుడు వాక్యాలు చేయడం కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బండికి తగదు. బిజెపి నాయకులు ఎందుకు తెలంగాణ ప్రాంతం పై ఎప్పుడు చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. దేశ ప్రధాని సరేంద్ర మోడీ పార్లమెంట్ నిండు సభలో తల్లిని చంపి బిడ్డకు జీవం పోశారని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని తప్పు పట్టి అవమానపరచడం జరిగింది. పద్మశ్రీ ఎంపికలు కూడా తెలంగాణ రాష్ట్రం తరఫున పంపిన పేర్లను పరిగణలోకి తీసుకోకుండా అవమాన పరచడం సరికాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుల కోసం చుక్క రామయ్య, గద్దర్, గోరేటి వెంకన్న అందెశ్రీ జై వీర్ తిరుమలరావు గార్ల పేర్లను పంపడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లలో ఏ ఒక్కరికి కూడా పద్మశ్రీ అవార్డు వచ్చేస్తాయి లేదు అని బండి సంజయ్ అనడం సరికాదు. ప్రభుత్వం పంపిన పేర్లలో ఏ ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా పేర్లు పంపడం జరిగింది. దానిలో వారికి ఆర్ఎస్ఎస్ బిజెపి సభ్యత్వం లేనందున వారు పద్మశ్రీ అవార్డుల స్థాయికి తగ్గవాళ్లు కాదు కాదా బండి సంజయ్ . గద్దర్ . కమ్యూనిస్టు భావజాలం గల వ్యక్తి అని అంటున్నారు కదా మరి ఈటల రాజేందర్ కూడా అదే భావజాలానికి చెందిన వ్యక్తే కదా వారికి ఎమ్మెల్యే టికెట్, ఎంపి టికెట్ ఇచ్చి గౌరవించుకు న్నారు కదా మరి అప్పుడు కమ్యూనిస్టు భావజాలం కనిపించలేదా బండి సంజయ్ . గద్దర్ నక్సలైట్ అయినప్పుడు ఈటల రాజేందర్ మరి ఏమైతరో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం.
చేసిన ప్రజా పోరాటాలు తెలియక మాట్లాడుతున్నా రు..70సంవత్సరాలుగా ప్రజల కోసం గద్దర్ గొంతు ఎత్తి పాడారు. రజాకార్ల పాలన మీద యుద్ధం చేసింది గద్దర్ గారు. పాటలు, సాహిత్యం ద్వారా ప్రజల్ని చైత న్యపరిచిన ఉద్యమ దీపిక గద్దర్ గారు. 1969 పుట్టిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా అనే పాటతో ఉద్యమానికి ఊపిరి పోశారు గద్దర్ .తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల ప్రాణాలు కోల్పోతుంటే చూసి చలించి ముందుండి ఉద్యమాన్ని నడిపిన యుద్ధ నౌక గద్దర్ గారు. గద్దర్ గారి గురించి కనీస అవగాహన లేని బండి సంజయ్ గారు ఇకనైనా గద్దర్ గారి పై చేసిన వ్యాఖ్యలని ఉపసంహారించుకోవాలని గట్టు రాజు గారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం గురించి తక్కువ చేసి మాట్లాడటం ఇకముందు చేస్తే రాష్ట్రంలో బిజెపి నాయకులను ఎక్కడికక్కడే అడ్డుకుంటామని హెచ్చరించడం జరిగింది.వారి అన్నారు