
జనం న్యూస్ 03 అక్టోబర్ 2025 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు జోగులాంబ ::ఇటిక్యాల ::- కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగట్టాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపోగు రాంబాబు అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఇటిక్యాల మండల కేంద్రంలో ముఖ్య కార్యకర్తలతో ఆయన మాట్లాడారు. పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వము పేదలకు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఆఘామేఘాల మీద తీర్మానం చేసి ప్రజలను గందరగోళానికి గురి అయ్యేటట్టు ప్రభుత్వము వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వాలు చేస్తున్న వైఫల్యాలను ప్రతి ఒక్కరికి ప్రజలకు పూస గుచ్చినట్టు వివరించి ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత కార్యకర్తలదేనన్నారు. ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులను గెలిపించుకొని బహుజన్ సమాజ్ పార్టీ సత్త చూపించాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మణికుమార్ , శివశంకర్ యాదవ్,కురవ రామకృష్ణ, బోయ చిన్న రాజు, ఎర్రవల్లి మండల అధ్యక్షుడు ధర్మవరం రాములు, శివన్న, నాని ,రంజిత్, పెద్దరాజు తదితరులు పాల్గొన్నారు.