
పాపన్నపేట. అక్టోబర్. 02 (జనంన్యూస్)
పాపన్నపేట్ లో దసరా వేడకలును పురస్కరించుకుని కన్నుల పండువగా అంగ రంగా వైభవంగా నిర్వహించారు. దసరా పండుగను పురస్కరించుకుని. మొదటగా స్థానిక నెహ్రూ విగ్రహం నుంచి పూజా కార్యక్రమాలు మొదలుకొని అనంతరం శివాజీ విగ్రహం వద్ద మరియు గ్రామంలో వందేమాతర గీతాలపనతో .జై శ్రీరామ్ అనే నినాదాలతో గ్రామ పురవీధుల గుండా స్థానిక బస్టాండ్ వద్ద ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం వరకు మధ్యలో ఉన్న హనుమాన్ ఆలయాల వద్ద కాశయపు జెండాలు ఎగురవేస్తూ ఆర్ఎస్ఎస్ గీతాన్ని ఆలపించి జెండా కార్యక్రమం ముగించారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జమ్మి చెట్టుకు పూజ చేసి అనంతరం' కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించి. అలై బలై తీసుకొని ఆనందంగా గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
