
జనం న్యూస్,అక్టోబర్ 03
ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు సచివాలయం నుండి ఓబులవారిపల్లి క్రాస్ రోడ్ వరకు జీఎస్టీ 2.O అవగాహన ర్యాలీ కార్యక్రమంలో అధికారులు మరియు ప్రజలతో కలసి ప్రత్యక్షంగా రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమాన్ని కేంద్రంగా తీసుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలకు జీఎస్టీ 2.O పథకాల ప్రాముఖ్యత, రైతులకు కలిగే లాభాలు వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు, రసాయనిక వాడకం వంటి వస్తువులపై జీఎస్టీ 13% నుండి 7% తగ్గిందని మొత్తంగా ఇప్పుడు జీఎస్టీ 2.O లో 5% ఉంది అని రైతులకు ఉపశమనం కలిగిస్తుందని ప్రజలకు వివరించారు.
రైతుల సంక్షేమం మా ప్రభుత్వం ముఖ్య లక్ష్యం జీఎస్టీ 2.O ద్వారా రైతులు మరియు మధ్యతరగతి కుటుంబాలు మరింత లబ్ధి పొందుతారని నమ్ముతున్నాము. ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంపొందించటం ద్వారా రైతుల సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి మేము కృషి చేస్తూనే ఉంటాము అని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రజలు, ఎన్ డి ఏ కూటమి నేతలు,గ్రామస్తులు, రైతులు, పార్టీ కార్యకర్తలు, ఎం పి డి ఓ ఎస్.విజయ రావు, మండల వ్యవసాయ అధికారి బి.మల్లికా, వెటర్నరీ డాక్టర్ జగన్నాధ రెడ్డి, ఓబులవారిపల్లి పోలీసు సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ అధికారి పి.బుల్లయ్య మరియు సిబ్బంది, అసిస్టెంట్ సెరికల్చర్ అధికారి రమాదేవి,టి ఏ సరళ వెలుగు క్లస్టర్ కోఆర్డినేటర్ దాము,హరి చిన్నఓరంపాడు పంచాయతీ సెక్రటరీ బి శివ ప్రసాద్, వి హెచ్ ఏ హరి సచివాలయ సిబ్బంది పాల్గొనడం జరిగింది.