
జనం న్యూస్ అక్టోబర్ 3 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని తుంగూర్- కండ్లపెల్లి గ్రామాల మధ్య ఇటీవల కురిసిన వర్షాల కారణంగా బ్రిడ్జి ప్రక్కన మట్టి కొట్టుకపోయి కయ్యాలుగా మారింది. దింతో మండల స్థాయి అధికారులు బ్రిడ్జిని పరిశీలించి ద్విచక్ర వాహనాలు తప్ప మరే వాహనాలు వెళ్లకుండా భారీ గేట్లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జి ప్రమాదకరంగా ఉండడంతో ఆటోలు మొదలుకొని భారీ వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని గమనించిన కండ్లపెల్లి తాజా మాజీ సర్పంచ్ పర్వతం రమేష్ శుక్రవారం జేసీబి తో మట్టి తోడించి ట్రాక్టర్ ద్వారా బ్రిడ్జి వద్దకు తరలించి బ్లెడ్ ట్రాక్టర్ సహాయం తో రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టారు. రమేష్ చేపట్టిన శ్రమాధానం కారణంగా మళ్ళీ తుంగూర్ నుండి కండ్లపెల్లి గ్రామాల గుండా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. మాజీ సర్పంచ్ రవి చేపట్టిన మరమ్మత్తు పనులకు పలువురు వాహన దారులు, గ్రామాల ప్రజలు అభినందించారు.ఈ కార్యక్రమం లో గంగదరి పూర్ణచందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
