
జనం న్యూస్ అక్టోబర్ 03 నడిగూడెం
యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల కొల్లు పాపయ్య చౌదరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యందు మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ పోటీల విజేతలైన అభ్యర్థులకు నగదును ప్రధానం చేసి మాట్లాడారు.ప్రధమ బహుమతిగా మండల పరిధిలోని ఈకే పేట తండా 30 వేల రూపాయలు, ద్వితీయ బహుమతి మండల కేంద్రానికి చెందిన లిటిల్ స్టార్ 25వేల రూపాయలు, తృతీయ బహుమతి జోగు పిచ్చిరెడ్డి ఫౌండేషన్ పొనుగోడు 15000 రూపాయల నగదును గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పందిటి కాంత్ కుమార్, నిర్వాహకులు సుదీప్, శ్యామ్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు..