
బిచ్కుంద అక్టోబర్ 3 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండలం లో సార్వజనిక దుర్గామాత , దేవీ శరణ్యవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు తొమ్మిది రకాలుగా అవతారలతో భక్తులకు దర్శనమిచ్చి పూజలు, కట్న కానుకలు స్వీకరించారు. శుక్రవారం అమ్మవారిని నియమ నిష్టలతో ఎస్సై మోహన్ రెడ్డి పోలీస్ సిబ్బంది పాల్గొని పటిష్టమైన భారీ బందోబస్తు మధ్య ఊరేగింపుగా కార్యక్రమం చేపట్టారు. మాల ధారణ స్వాములు నృత్యాలు, భక్తి పాటలు, భాజ భజంత్రుల తో వాడవాడలకు తరలిస్తూ మహిళా మూర్తులు మంగళహారతులతో స్వాగతం పలికీ మొక్కులు తీసుకున్నారు. అమ్మవారు తొమ్మిది రోజులు నియమ నిష్టలతో భక్తులు తీరొక్క నైవేద్యాలు, తీపి వంటకాలు, పండ్లు, పూలు, కట్న కానుకలు సమర్పించి పూజలు నిర్వహించి మండల, ప్రజలు పాడిపంటలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఎల్లవేళలా చల్లంగా ఉండేవిధంగా దీవించాలని వేడుకున్నారు. మాల ధారణ స్వాములు అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మండపాల కూడలిలో భక్తులకు అసౌకర్యాలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టారు. ఊరేగింపులో భాగంగా ఎటువంటి సమస్యలను తలపెట్టకుండా నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవముగా జరుపుకొని పోలీస్ సిబ్బందికి సహకరించిన మాలధారణ స్వాములు, భక్తులపైన ఎస్సై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాలదరణ స్వాములు, దేవాదాయ కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామ పెద్దలు, ప్రజలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

