
జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా. అక్టోబర్ 4, నందలూరు మండలంలోని పాటూరు గ్రామానికి చెందిన వైయస్సార్సీపి నాయకుడు ముమ్మడి శెట్టి చంద్ర సతీమణి లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్నవైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు,రాజంపేట శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి లక్ష్మీ దేవి పార్థీవ దేహానికినివాళులుఅర్పించి,కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన వెంట రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోబ్బిళ్ళ త్రినాథ్, ఆకేపాటి జగదీశ్వర్ రెడ్డి,అక్కిరెడ్డి మోహన్ రెడ్డి , కసి రెడ్డి నరసింహ రెడ్డి, భూ సిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విజయుడు,మధు,రాజు, మహబూబ్ భాష తదితరులు పాల్గొన్నారు.