
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెప్టెంబర్ 4 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955 స్త్రీ శక్తి పథకం వల్ల మహిళలు పొందుతున్న సంతోషం కంటే రెట్టింపు సంతోషం డ్రైవర్లు పొందాలన్నదే ముఖ్య మంత్రి ఆలోచన గత ప్రభుత్వం రూ.30వేలకు పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమిప్రభుత్వం రూ.3వేలకు తగ్గించింది. ఆటో డ్రైవర్లు ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలి : ప్రత్తిపాటి ఆటోడ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించి, డ్రైవర్లతో కలిసి మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, స్వయంగా ఆటో నడిపిన మాజీమంత్రి ప్రత్తిపాటి. మేనిఫెస్టో హామీ కాకపోయినా, తమ ప్రభుత్వంలో ఎవరూ నష్టపోకూడదన్న సదుద్దేశంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు అండగా నిలిచి ‘ఆటో డ్రైవర్ల సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టారని, ఈ ఒక్కరోజే 2,90,669 మందికి రూ.436 కోట్లు అందచేసి సరికొత్త చరిత్ర సృష్టించారని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. శనివారం పట్టణంలో డ్రైవర్ల సమక్షంలో ‘ఆటోడ్రైవర్ల సేవలో’ పథకాన్ని ప్రారంభించిన ప్రత్తిపాటి వారితో కలిసి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం 300 ఆటోలతో డ్రైవర్లు నిర్వహించిన ర్యాలీలో స్వయంగా ఆటోనడిపిన ప్రత్తిపాటి.. ప్రజల్ని ఉత్సాహపరిచి, వారిని ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను కూటమిప్రభుత్వం రూ.3వేలకు తగ్గించింది. తమను గుర్తించి.. తమ కుటుంబాలను కూటమిప్రభుత్వం ఆదుకోవడంపై ఆటో డ్రైవర్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం వారికి అందించే రూ.15వేల ఆర్థిక సాయంతో పాటు, సూపర్ - 6 పథకాలు కూడా వారి కుటుంబాలకు ఎంతగానో దోహదపడుతున్నాయని ప్రత్తిపాటి చెప్పారు. పల్నాడు జిల్లాలో 8,884 మంది డ్రైవర్ / యజమానులకు రూ.13.32 కోట్ల మేర ప్రభుత్వ సాయం అందనుందన్నారు. చిలకలూరిపేటలో 1189 మందిని పథకానికి ఎంపికచేసి, రూ.1కోటి69లక్షల35వేలు అందించారు. పథకం సద్వినియోగం చేసుకుంటున్న డ్రైవర్లు, యజమానులు అందరూ కూటమిప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. గత ప్రభుత్వం డీబీటీ విధానంలో సాయం పేరుతో ప్రజల్ని వంచించిందని, బటన్ నొక్కుడు పేరుతో అరకొర సాయం చేసి, అడ్డగోలుగా ప్రజల్ని దోచేసిందన్నారు. ఆటో డ్రైవర్లకు రూ.10వేలు ఇచ్చి, రోడ్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, పోలీస్, మరియు రవాణా శాఖ ఫైన్లతో వారిని అడ్డగోలుగా దోచేసిందన్నారు. గత ప్రభుత్వం రూ.30వేలకు పెంచిన గ్రీన్ ట్యాక్స్ ను, కూటమిప్రభుత్వం రూ.3 వేలకు తగ్గించిందన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకానికి అర్హులైన ప్రతి లబ్ధిదారుకు ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందన్న ప్రత్తిపాటి.. పథకం పొందాలనుకునే వారు తమ వివరాలను ప్రభుత్వం నిర్వహించే గ్రీవెన్స్ లో నమోదు చేసుకోవచ్చన్నారు. దుష్ప్రచారంతోనే వారి కడుపు నిండుతుంది.. ప్రజల ముఖాల్లో కనిపించే సంతోషంతో చంద్రబాబు సంతృప్తి పడితే.. ప్రజల్ని ఏమార్చి, వారిని రెచ్చగొట్టేలా చేసే దుష్ప్రచారంతోనే వైసీపీనేతల కడుపు నిండుతుందని ప్రత్తిపాటి చెప్పారు. వైసీపీనేతలు తమ అవినీతి మీడియాలో, కూలీల్ని పెట్టుకున్న సోషల్ మీడియాలో కావాలనే ప్రజాప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విషం చిమ్మితేనే వారి మనసు కుదుటపడుతుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజల్లోని ప్రతి వర్గం సంతోషం కోసం పనిచేసే ప్రభుత్వాన్ని విమర్శించే ముందు, తాము ఎంతగా ప్రజలకు దూరమవుతున్నారో కూడా వైసీపీ నేతలు గ్రహించాలన్నారు. గత ప్రభుత్వం కేవలం ప్రచారానికి మాత్రమే వాడుకొని, డ్రైవర్లను వంచించిందన్నారు. 2.60 లక్షల మందికి రూ.10ల చొప్పున ఇచ్చినట్టు ప్రచారం చేసుకొని, సగం మందికి మాత్రమే వైసీపీ ప్రభుత్వం ఆర్థిక సాయం అందించిందన్నారు. అలా ఇచ్చినదానికి మూడురెట్లు మరలా డ్రైవర్ల నుంచి వివిధ రూపాల్లో దండుకుందన్నారు. చంద్రబాబు పథకాలు భవిష్యత్ లో దేశానికే మార్గదర్శకంగా నిలుస్తాయి.
పనిచేసే ప్రభుత్వానికి, మాటలతో, అవినీతితో తమను మోసగించిన ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలకు ఇప్పటికే గ్రహించారని ప్రత్తిపాటి స్పష్టంచేశారు. చంద్రబాబు ఆలోచనలు దార్శనికత ఎలాగైతే దేశానికి దిక్సూచిగా నిలిచిందో, ఆయన పథకాలు కూడా భవిష్యత్ లో అనేక రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రత్తిపాటి అభిప్రాయపడ్డారు. ప్రతి ఆటో డ్రైవర్ తమకు జరిగిన మేలుతో పాటు, ప్రభుత్వ పథకాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలోని ఆటో డ్రైవర్లకు టిడ్కో ఇళ్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తానని, అవసరమైతే ప్రభుత్వంతో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని ప్రత్తిపాటి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని మూడు మండలాలు, పట్టణ, కూటమి నాయకులు, ఎంపీడీవో లు, ఆర్టీవో అధికారులు, వివిధ హోదాలలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ఆటో డ్రైవర్లు, మున్సిపల్ అధికారులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.