జనం న్యూస్, అక్టోబర్ 4, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్) తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి నివాసంలో శనివారం మామిడియాల గ్రామానికి చెందిన అశోక్ కుమార్, కలిసి గ్రామస్తులకు రావలసిన ప్యాకేజీలను ఇప్పించాలని వినతి పత్రం ఇచ్చారు.మంత్రి మాట్లాడుతూ ప్యాకేజీలు అర్హులైన వారికి ఇప్పించడానికి నేను కలెక్టర్ తో మాట్లాడుతానని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరూ స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీకి పనిచేయాలని మంత్రి తెలిపారని అశోక్ అన్నారు. మామిడాల గ్రామానికి చెందిన పొట్ట అశోక్ కుమార్ శనివారం తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి గ్రామస్తులకు రావాల్సిన ప్యాకేజీలను ఇప్పించాలని అలాగే 18 సంవత్సరాలు నిండిన వారి ప్యాకేజీలు ఎమ్మార్వో మరియు ఆర్డిఓ లో పరిశీలించి కలెక్టర్ కు పంపించారని వాటిని కలెక్టర్ ఇప్పటివరకు ఆమోదించలేదని మంత్రికి తెలిపారు. గ్రామానికి చెందిన 18 సంవత్సరాల నుండి నా ప్యాకేజీలు ఒంటరి మహిళల ప్యాకేజీలు అలాగే పూర్తి ప్యాకేజీలు ఇప్పటివరకు సుమారు 150 వరకు రావలసి ఉన్నవని మంత్రికి తెలిపారు. గత ఐదు సంవత్సరాల క్రితం బిఆర్ఎస్ వాళ్లు ఎంపిటిసి గెలవడానికి ఎలక్షన్ సమయంలో ప్యాకేజీలు ఇచ్చారని మంత్రికి తెలిపారు. గ్రామంలో జరిగే సమస్యలను మంత్రికి వివరించారని అశోక్ తెలిపారు..మంత్రి మాట్లాడుతూ అర్హులైన వారికి ప్యాకేజీలు ఇప్పిస్తానని ఆయన అన్నారన్నారు . మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు .