జనం న్యూస్ అక్టోబర్ 4 జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలంలోని పాలు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో, రంగురంగుల పుష్పాలతో అలంకరించిన బతుకమ్మలను మోసుకొని, పాటలతో, నృత్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలంగాణ సంస్కృతిని సజీవంగా ప్రతిబింబించారు. బతుకమ్మ పాటలు, పూల అలంకరణ, సాంప్రదాయ నృత్యాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి., స్థనిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరై, మహిళల ఉత్సాహాన్ని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కృతి పరిరక్షణ కార్యక్రమాలు ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయని వారు పేర్కొన్నారు.ఈ సందర్భంగా స్వచ్ఛత, మహిళా శక్తి, స్థానిక అభివృద్ధి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వహించారు.బతుకమ్మ పండుగ ద్వారా తెలంగాణ మహిళల ఆత్మబలాన్ని, సంస్కృతీ వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేల కండ్లపెల్లి మంగేళ రంగా సాగర్ గ్రామస్థులు విజయవంతంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు