అడుగడుగునా గుంతలు.. ఏండ్లు గడుస్తున్న పూడ్చని అధికారులు

- గ్రామాలలో రహదారులపై ఇబ్బడి ముబ్బడిగా తవ్వకాలు
- తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు పల్లె ప్రజలు (జనం న్యూస్:26డిసెంబర్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి )=- ప్రతి ఇంటికి తాగునీరు అందించాలని గత ప్రభుత్వం హయాంలో మిషన్ భగీరథ అధికారులు మండల వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో సిమెంటు రహదారులను పగలకొట్టి మరి పైపులు వేశారు. కానీ పగలగొట్టిన చోట పూడ్చకుండా వదిలేశారు. దీంతో వాహనదారులు గ్రామాలలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క వీధిలో ఐదారు గుంతలు ఉన్నాయంటే గ్రామాలలో మొత్తం
గుంతలు ఎన్ని ఉన్నాయో ఉందో అర్థం చేసుకోవచ్చు. లక్షల రూపాయలు పెట్టి వేసిన
సిమెంటు రోడ్డులను అడ్డగోలుగా పగలగొట్టి పైపులైన్లు వేశారు. కానీ వేసిన చోట పూడ్చకుండా వదిలేశారు. దీంతో ద్విచక్ర వాహనాలు పూర్తిస్థాయిలో దెబ్బతింటున్నాయి. రాత్రి సమయాలలో కనిపించని పరిస్థితులలో ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏండ్లు గడుస్తున్నా ఆ గుంతలను అలాగే వదిలివేసారని ఇప్పటికైనా స్పందించి రహదారుల వెంట ఉన్నటువంటి గుంతలను పూడ్చలని ప్రజలు కోరుతున్నారు.