
జనం న్యూస్ అక్టోబర్ 05 నడిగూడెం
స్థానిక ఎన్నికల షెడ్యూల్తో నడిగూడెం మండలం రాజకీయం రసవత్తరంగా మారింది. ఎన్నికల రణరంగంలో విజయం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా, అధికార, ప్రతిపక్ష పార్టీలు 'గెలుపు గుర్రాల' కోసం అన్వేషణ ముమ్మరం చేశాయి. అంగబలం, ఆర్థికబలం, ప్రజల్లో పట్టు ఉన్న నాయకుల కోసం గాలింపు పెంచాయి.