
జనంన్యూస్. 05.సిరికొండ. ప్రతినిధి.
నిజామాబాదు రురల్ సిరికొండ మండల కేంద్రంలో పoధిమడుగు గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కొంకటి రమేష్ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు.ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు నక్క రాజేశ్వర్ , సిరికొండ మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఉపాద్యక్షుడు నక్క రాజేశ్వర్ కండువ వేసి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు రామస్వామి, సిరికొండ మండల జనరల్ సెక్రటరీ మాలోత్ రాజేందర్,దర్పల్లి బాబురావు
ఉపాధ్యక్షుడు, నాపురం సురేష్, కరోలా రాజు, కెలూత్ రాజు, అజయ్, కిరణ్ దాస్, మారుతి, మలావత్ మహిపాల్ తదితర నాయకులు పాల్గొన్నారు.