
జాయింట్ సెక్రెటరీ బూనేని సుధాకర్
(జనం న్యూస్ 6 అక్టోబర్ ప్రతినిధి కాజీపేట రవి)
స్వతంత్రం వచ్చిన 78 సంవత్సరాలు గడిచినా భీమారం మండల కేంద్రంలో ఇప్పటివరకు సర్పంచ్,పదవి ఎంపీటీసీ జడ్పిటిసి నాయక పోడు ,కోయ జాతులకు అవకాశం కేటాయించకపోవడం వర్గాలలో తీవ్ర ఆవేదనకు కారణమైంది. నాయకపోడు కోయ, సమాజానికి చెందిన ప్రజలు “మాకు నాయకత్వం వహించే సత్తా లేదా? చదువు, జ్ఞానం లేదా? మేము నాయకపోడు, కోయ, కులాలను మాత్రమే ఎందుకు పక్కన పెడుతున్నారు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. మండల కేంద్రంలో*ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే సత్తా రాకపోవడం వల్ల రాజకీయంగా తాము వెనుకబడి పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఈ పరిస్థితి జనాభా లెక్కల్లో లోపం వల్లా లేక స్థానిక నాయకులు, అధికారుల నిర్ణయాల వల్లా అని మండల కేంద్రంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.“ఎనిమిది దశాబ్దాలుగా భీమారం మండల కేంద్రంలో సర్పంచ్, జడ్పిటిసి,ఎంపిటిసి పదవికి నాయకపోడు , కోయ జాతులకు పదవులు రాకపోవడం స్పష్టమైన వివక్ష. ప్రభుత్వం వెంటనే సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలి. నాయక పోడు కోయ కులాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నాయకపోడు, జాయింట్ సెక్రెటరీ, బూనేని సుధాకర్ ఆరోపించాడు