
పాలన పేరుతో అవినీతి చేసి, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు
గాడిన పెడ్తున్న ప్రభుత్వంపై విమర్శలు సిగ్గుచేటు
మండలానికి ఉన్న బాకి పై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు సమాధానం ఇవ్వాలి
కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట,తేది:05.10.2025.
బాకీ కార్డుల పేరుతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొత్త నాటకానికి తెరలేపారని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి విమర్శించారు. శాయంపేట మండల కేంద్రంలో ఆదివారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గారు బాకీ కార్డులు పంపిణీ చేసిన నేపథ్యంలో సోమవారం మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహం నుండి పిఎసిఎస్ భవన నిర్మాణం కోసం గతంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి గారు భూమి పూజ చేసిన శిలాఫలకం వరకు పాదయాత్ర చేసి అట్టి శిలాఫలకం వద్ద పిండ ప్రధానం కార్యక్రమం నిర్వహించారు . తదనంతరం బుచ్చిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... ఏ పార్టీ అయినా ఎన్నికల ముందు ఇచ్చే హామీలు అధికారంలోకి వచ్చాక అమలు చేయాలని ఉద్దేశంతోటే ఇస్తారన్నారు మిగులు రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అవినీతికి పాల్పడి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూ ఒక్కొక్కటిగా హామీలు అమలు చేస్తున్న క్రమంలో పాలనలో కనీసం రెండేళ్లు పూర్తికాకుండానే తమ ఉనికి కోసం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 22 నెలల కాలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, రైతులకు రుణమాఫీ, సన్నాలకు బోనస్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ కనెక్షన్, సుమారు 60 వేల ఉద్యోగ కల్పన, రేషన్ కార్డుల పంపిణీ హామీలు అమలు అవుతున్నాయని, మేనిఫెస్టోలో లేని రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ పథకం సైతం అమలు జరుతుందని, ఈ పథకాలు బీఆర్ఎస్ నాయకులకు కూడా అమలయ్యాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బాకీలు పదేళ్లు అధికారంలో ఉండి ఇంటికొక ఉద్యోగం, దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడు ఎకరాల భూమి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూమ్ లు, కేజీ టు పీజీ విద్య, పోడు భూముల పట్టాలు, అమరుల కుటుంబాలకు ఉద్యోగం, ముస్లిం లకు రిజర్వేషన్లు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చారు. అవన్నీ అమలు చేశారో చెప్పాలని నిలదీశారు.మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకరమణరెడ్డి గారి బాకి: శాయంపేట మండలానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గారు ఎంతో బాకి పడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల కష్టంతో గెలిచి, వారి సతీమణికి పదవితెచ్చుకున్నారే తప్ప అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. PACS భవనానికి శిలాఫలకం వేసి నిధులున్నా కట్టించలేని అసమర్థులు. శాయంపేట పిఎసిఎస్ లో మాజీ పాలకవర్గ సభ్యులు అయిన గండ్ర వెంకట రమణారెడ్డి అనుచరులు 15 లక్షల రూపాయల అవినీతికి పాల్పడి సొసైటీకి బాకీ పడితే అవి రికవరీ చేయించలేని అసమర్ధ నాయకులు గండ్ర వెంకట రమణారెడ్డి గారు... అట్టి రూపాయలను వెంటనే రికవరీ చేయించి కాంగ్రెస్ ప్రభుత్వం పై మాట్లాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో ఇళ్లను కోల్పోయిన వారికి 15 రోజుల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రొసీడింగ్స్ తెచ్చి, కట్టిస్తా అన్నారు.. కట్టించారా... డ్రైనేజీలు లేని రోడ్డు వేసి స్థానికులను ఇబ్బందులు పెట్టడం వాస్తవం కాదా..సుమారు 200 డబుల్ బెడ్రూమ్ లకు శిలాఫలకాలు వేశారు కట్టించారా... జిపి భవనాలకు శిలాఫలకాలు వేశారు కట్టించారా... మండల ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలిచే అంబులెన్స్ కావాలని అడిగితే డీజిల్ ఎవరు పొయ్యాలి.. ఎవరు నడపాలి.. అని అవహేళనగా మాట్లాడింది మీరు కాదా... అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తున్న మాజీ ఎమ్మెల్యే గారు వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు
