
పాపన్నపేట. అక్టోబర్. 05 (జనంన్యూస్)
మండల కేంద్రమైన పాపన్నపేటలో ఆదివారం సాయంత్రం 5-00 గంటలకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్తల చేత RSS పాపన్నపేట కండ ఆధ్వర్యంలో విజయదశమి మరియు రాష్ట్ర స్వయంసేవక్ సంఘ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పాపన్నపేటలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పత్ సంచలన్ కార్యక్రమం నిర్వహించారు.సుమారు 150 మంది స్వయం సేవకులచే పురవీధుల గుండా దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
