
జన న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ ముమ్మిడివరం
అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ నందు చదువులో ప్రతిభ కలిగిన ఉత్తమ విద్యార్థులకు కత్వ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్ పంపిణీ చేశారు. పలువురు డొనేషన్స్ ఇవ్వగా ఎక్కువ మొత్తంలో తాడి నరసింహారావు లక్ష రూపాయలు నగదును కత్వ అసోసియేషన్ కు అందించారు.పలువురి వద్ద వసూలు చేసిన నగదును కలిపి పెద్ద సంఖ్యలో విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించారు.ప్రతిబి గల ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహించాలని సదుద్దేశంతో స్కాలర్ షిప్ ఇవ్వడానికి సహకరించిన తాడి నరసింహారావు ను తులసి సీడ్స్ అధినేత రామచంద్ర ప్రభు అభినందించారు.ఈ కార్యక్రమంలో కల్వకొలను తాతాజీ చింతపల్లి అజయ్ కుమార్ దాట్ల బాబు యాళ్ళ ఉదయ్ గోదాసి గణేష్ తదితరులు పాల్గొన్నారు.
