
జనం న్యూస్ అక్టోబర్ 6 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ఐ పోలవరం మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఐ పోలవరం ఉప మండలం ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముందుగా కాషాయ ధ్వజానికి పూజలు నిర్వహించి గౌరవ నమస్కారం చేశారు. అనంతరం భారతమాత,మాధవ్ సదాశివరావు గోల్వాల్కర్ గురుజి,డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ చిత్రపటాలకు పూలమాలలు అర్పించి పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఎస్ ఎస్ ఉత్తరాంధ్ర ప్రాంత సత్సంగ్ ప్రముఖ్ రాళ్లపల్లి పాపయ్య శర్మ,
ముఖ్య వక్తగా హాజరు కాగా, ముఖ్య అతిథిలుగా స్థానిక పెద్దలు భూపతి రాజు చంటిబాబు, సాగిరాజు సూరిబాబు రాజు, సాగిరాజు బాపిరాజు,ముమ్మిడివరం ఖండ సంఘ్ చాలక్ పెన్మెత్స గోపాల కృష్ణంరాజు సమరసత సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, పేరాబత్తుల రామకృష్ణరావు, ఏలూరి రాంబాబు, సాన బోయిన రాంబాబు, సఖిరెడ్డి శ్రీనివాస్, మామిడాల వీర వెంకట సత్యనారాయణ, కాశి సోమేశ్ పాల్గొని విజయ దశమి ఉత్సవాలు గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఐ పోలవరం ఉప మండలం ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు, ఐ పోలవరం,కేశనకుర్రు,కేశనకుర్రు పాలెం,తిల్లకుప్ప,టి కొత్తపల్లి గ్రామాల ప్రముఖులు, స్థానిక గ్రామ పెద్దలు,రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.
