
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 6 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ప్రజల ప్రాణాలు తీయడానికే వారు తనకు అధికారమిచ్చారన్నట్టు జగన్ ఐదేళ్లు అడ్డగోలుగా దుర్మార్గాలకు పాల్పడ్డాడు : ప్రత్తిపాటి.
తన హాయాంలో జరిగిన రైతు, రైతుకూలీలు, నిరుద్యోగుల ఆత్మహత్యలపై జగన్ స్పందించాలి : ప్రత్తిపాటి.
2022లో జంగారెడ్డిగూడెంలో సంభవించిన కల్తీ మద్యం మరణాలపై నాడు జగన్ ఏం చర్యలు తీసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి : ప్రత్తిపాటి
కల్తీ మద్యం మరణాల్ని అసెంబ్లీ సాక్షిగా సహజమరణాలుగా చిత్రీకరించి, తనకు అంటిన పాపాన్ని జగన్ కడిగేసుకునే ప్రయత్నం చేయలేదా? : ప్రత్తిపాటి.
తన హాయాంలో జరిగిన రైతు, రైతుకూలీలు, నిరుద్యోగుల ఆత్మహత్యల్ని బహిర్గతం చేసిన ఎన్.సీ.ఆర్.బీ నివేదికపై జగన్ స్పందించాలి : ప్రత్తిపాటి
“ తన స్వప్రయోజనాల కోసం జగన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నాడు. ప్రజాసమస్యల పరిష్కారంలో, వారికి అందించే సంక్షేమ పథకాల్లో కూటమిప్రభుత్వం ఎంత చురుగ్గా పనిచేస్తోందో, ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే, ప్రజలకు చెడుచేసే ఎటువంటి ఘటనలు, అంశాలపై అయినా అంతే వేగంగా స్పందిస్తోంది. తర, తమ బేధాలు లేకుండా ప్రజలకు కీడు చేసేవారిని కఠినంగా శిక్షిస్తామని ఇప్పటికే ప్రజా ప్రభుత్వం పలుమార్లు నిరూపించుకుంది. తాజాగా అన్నమయ్య జిల్లా ములకలచెరువు కల్తీమద్యం ఘటనపై కూడా ప్రభుత్వం చాలా వేగంగా చర్యలకు ఉపక్రమించింది. జగన్ అవకాశవాద రాజకీయాలకు తావులేకుండా వెంటనే చర్యలు చేపట్టింది. కల్తీ మద్యం తయారీ కేసులో 14 మంది పాత్ర ప్రమేయాన్ని గుర్తించిన పోలీస్ శాఖ, 10మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీనేతలైన జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడుల ప్రమేయంపై ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. నిజానిజాలు బహిర్గతం కాకముందే వారి పేర్లు కల్తీమద్యం వ్యవహరంలో బయటకు వచ్చినవెంటనే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఇంత జరిగినా జగన్మోహన్ రెడ్డి తన అవకాశవాద, విద్వేష రాజకీయాలు వదలడం లేదు.ములకలచెరువు కల్తీమద్యంపై మాట్లాడేముందు.. జగన్ జంగారెడ్డి గూడెం కల్తీమద్యం మరణాలపై పెదవి విప్పాలి 2022లో ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో సంభవించిన కల్తీమద్యం మరణాలకు ఎవరు కారకులో, నాడు జరిగిన ఘటపపై ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఏం చర్యలు తీసుకున్నాడో, తన చేతికి మట్టి అంటకుండా నిజాలను ఎలా కప్పెట్టాడో ఆయనే ఇప్పుడు ఒకసారి ప్రజలకు చెబితే బాగుంటుంది. అదే విధంగా ఇటీవల విడుదలైన ఎన్.సీ.ఆర్.బీ నివేదిక, ప్రమాదమరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక-2023 లోని ఆధారాలతో కూడిన వాస్తవాలపై కూడా జగన్ స్పందించాలి. తనపాలనలో బతుకుభారమై, పూటగడవడమే కష్టమై తనువు చాలించిన రైతులు, రైతుకూలీలు, నిరుద్యోగుల జీవితాలను తనను ఏవిధంగా బలితీసుకున్నది జగన్ చెప్పాలి. తన పాలన రైతులకు స్వర్ణయుగమని చెప్పుకునే జగన్ .. తనహాయాంలో వారానికి నలుగురు రైతులు, రోజుకు ఇద్దరు కౌలురైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకున్నాడో ప్రజలకు సమాధానం చెప్పాలి.జగన్ ధనదాహం వల్లే జంగారెడ్డి గూడెం ఘటనలో 27మంది బలయ్యారు..ముఖ్యమంత్రిస్థానంలో ఉండి ప్రజల ప్రాణాలు పోతాయనే కనీస ఆలోచన లేకుండా కేవలం ధనదాహంతో కల్తీ, హానికరమైన విషపూరిత మద్యాన్ని ప్రోత్సహించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. ములకలచెరువు కల్తీమద్యం ఘటనపై చంద్రబాబు సత్వరమే స్పందించి, సొంతపార్టీ వారిని కూడా ఉపేక్షించకుండా చర్యలు తీసుకున్నారు. అదే స్థాయిలో జగన్ ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో స్పందించారా? 2022 మార్చి 9 నుంచి 12 వరకు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన అంశాన్ని జగన్ అసెంబ్లీసాక్షిగా నీరుగార్చాడు. కల్తీ మద్యం కాటుకు 27 మంది అమాయకులు బలైతే. వారి మరణాలన్నీ సహజమరణాలుగా చిత్రీకరించి తన చేతులకు అంటిన పాపాన్ని జగన్ కడిగేసుకునే ప్రయత్నం చేశాడు. ముఖ్యమంత్రిననే విషయం మర్చి.. స్వప్రయోజానాలు, దురాశతో హానికారక విషపూరిత మద్యం అమ్మి 3,500 కోట్ల కుంభకోణానికి కారకుడయ్యాడు. వారి ప్రాణాలు తీయడానికే ప్రజలు తనకు అధికారమిచ్చారన్నట్టు విచ్చలవిడి దురాగతాలకు పాల్పడ్డాడు. జంగారెడ్డిగూడెం ఘటనలో కల్తీ మద్యం తాగిన కొద్ది గంటల వ్యవధిలోనే తీవ్రమైన కడుపునొప్పి.. చూపు కోల్పోవడం.. వాంతులు, తల తిరగడం, ముఖం నల్లగా మారడం వంటి లక్షణాలతో పోయిన ప్రాణాలన్నీ సహజ మరణాలు ఎలా అయ్యాయో జగన్ ఇప్పటికైనా నోరువిప్పాలి. చనిపోయిన వారి కుటుంబాలు రోడ్డునపడినా, బాధితులంతా తమవారు కల్తీమద్యం వల్లే చనిపోయారని గగ్గోలు పెట్టినా ఆనాడు జగన్ మాటమాత్రంగా కూడా వారి వేదనపై స్పందించలేదు. అలాంటి వ్యక్తి నేడు ప్రతి అంశాన్ని రాజకీయం చేసి, ప్రతి ఘటనకు ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేస్తూ తన పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేయడం ఆయన కుహనా రాజకీయాలు, కుత్సిత రాజకీయాల్లో భాగమనే చెప్పాలి.” అని మాజీమంత్రి ప్రత్తిపాటి ఒక ప్రకటనద్వారా జగన్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు.