
జనం న్యూస్ హయత్ నగర్ ::06/10/2025
రాష్ట్ర అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టినప్పటి నుండి ఇబ్రాం శేఖర్ ఆధ్వర్యంలో బీఎస్పీ లో చేరికలు జోరందుకున్నాయి.ఈ రోజు వారి నివాసం లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వివిధ గ్రామాల నుండి పార్టీ లో జాయిన్ అయ్యారు.ఈ సందర్బంగా ఇబ్రాం శేఖర్ మాట్లాడుతూ మహనీయుల ఆశయాలకోసం కలహాలు పక్కన పెట్టి మీతోపాటు మీ బంధువులను కూడా బహుజన ఉద్యమంలోకి తీసుకురావాలి అని పిలుపునిచ్చారు. జాయిన్ అయ్యిన వారిలో ముకునూర్ గ్రామానికి చెందిన పెఱిక అంజయ్య , పోల్కంపల్లి గ్రామానికి చెందిన పంది మహేందర్ ,పెద్ద అంబర్ పేట్ గ్రామానికి చెందిన పోలేపల్లి నవీన్ కుమార్ గారు ఉన్నారు.ఈ కార్యక్రమంలో రంగా రెడ్డి జిల్లా కార్యదర్శి గ్యార మల్లేష్ , నాయకులు యంజాల ప్రహ్లాద్ చిత్రం కృష్ణ , పెద్ద ముత్తని గణేష్ పోల్గన్నారు….