
జనం న్యూస్ అక్టోబర్ 7, వికారాబాద్ జిల్లా
పూడూరు మండలంలోని రైతు నేస్తం కార్యక్రమానికి పూడూరు రైతు వేదిక నుండి హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి రాజారత్నం. రైతు నేస్తం కార్యక్రమం అనంతరం గత నెల రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడం కోసం పెద్ద ఉమ్మెంత ల గ్రామంలో పంట పొలాలను పరిశీలించి ప్రాథమిక అంచనా ప్రకారం 450 ఎకరాలు పత్తి పంట దెబ్బతిందని నిర్ధారించడం జరిగింది. పంట నష్టం జరిగిన రైతులు తమ వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించగలరని సూచించారు. ఇట్టి కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి తులసిరామ్ విస్తరణ అధికారులు శివ, రాజకుమార్, రైతులు క్రాంతి, యాదయ్య, తిరుమలయ్య, అనంతరాములు, తదితరులు పాల్గొన్నారు.