
ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ముదిరాజుల పతాకావిష్కరణ వాల్మీకి మహర్షి జయంతి,
జనం న్యూస్,అక్టోబర్ 07,కంగ్టి
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ ముదిరాజ్ సంఘ భవనములో మంగళవారం అంగరంగ వైభవంగా వాల్మీకి జయంతిని నిర్వహించారు. జయంతి సందర్భంగా సోమవారం వైష్ణవ సాంప్రదాయ హరి సంకీర్తన,హరి జాగరణ, మంగళవారం రోజున హరి కీర్తన గావించి ముదిరాజుల పతాకావిష్కరణను గావించారు.ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి పుష్ప మాలలు,టెంకాయలు, మంగళ నిరాంజనాలు, నైవిద్యాన్ని, సమర్పించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ వాల్మీకి మహర్షి,పేరు రత్నాకరుడు.ప్రచేతస మహర్షి కుమారుడైన రత్నాకరుడు,పుట్టలు అతని శరీరం చుట్టూ పెరగడం వలన "వాల్మీకి" అనే పేరు పొందాడు. తండ్రి పేరు: రత్నాకరుడి తండ్రి పేరు ప్రచేతస మహర్షి.జన్మ వృత్తాంతం: ప్రచేతసుడి పుత్రుడు కాబట్టి,అతన్ని ప్రాచేతసుడు అని పిలుస్తారు."వాల్మీకి" అనే పేరు రావడం: చాలా సంవత్సరాలు తపస్సు చేసినప్పుడు, వాల్మీకి శరీరం చుట్టూ చీమల పుట్టలు పెరిగి, వాటిని తొలగించే వరకు అతను అక్కడే ఉండిపోయాడు. సంస్కృతంలో చీమల పుట్టలను 'వాల్మీకం' అంటారు,దీని కారణంగానే అతనికి 'వాల్మీకి' అనే పేరు వచ్చింది అని అన్నారు. అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వైష్ణవ సాంప్రదాయ వైష్ణవ సాంప్రదాయ భక్తులు, ముదిరాజ్ సంఘ పెద్దలు,యువకులు, మహిళలు,తదితరులు పాల్గొన్నారు.