
జనం న్యూస్, అక్టోబర్ 7, ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ )
యువత రాజకీయాల్లోకి రావాలని బి ఆర్ ఎస్ యువ నాయకుడు శెమ్మని భాస్కర్ అన్నారు, సోమవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ యువ నాయకుడు భాస్కర్ మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత సత్తా చాటాలని యువత తెలుసుకుంటే కానిది ఏది లేదని,గ్రామాల అభివృద్ధి యువతతోనే సాధ్యం అని రాబోయే ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున పోటీ చేసి గెలుపొంది గ్రామాల అభివృద్ధికోసం కృషి చేయాలని అన్నారు,వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందు తరాలకి మార్గం చూపిస్తూ మొక్కవోని దీక్ష తో ప్రజలకు సేవ చేయాలి అనే ఒక సువర్ణావకాశం అని అన్నారు.