
.జనం న్యూస్ అక్టోబర్ 8 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయిపై జరిగిన దాడిని ముక్తకంఠంతో ఖండిస్తూ సంయుక్త ప్రకటనలో వంగర సాంబయ్య విలేకరులతో మాట్లాడుతూ
నిన్నటి రోజు సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన దాడి భారత రాజ్యాంగంపై జరిగినదిగా భావిస్తున్నామని
అగ్ర వర్ణాల వారు న్యాయమూర్తులను బెదిరించడం ప్రభావితం చేయటం భారత రాజ్యాంగానికి మంచిది కాదని అన్నారు పొరుగున ఉన్న నేపాల్ శ్రీలంకలో దేశాలలో తిరుగుబాట్లు గమనించాలని అన్నారు
ఈ దేశంలో బెదిరిస్తాం చంపుతామని టార్గెట్ పెట్టి రాజ్యాంగాన్ని ఖూనీ చేస్తాం అనుకుంటే ఈ దేశంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనిగిమనిగి ఉండాలని చూస్తే త్వరలో ఏదో ఒక రోజు కచ్చితంగా మీ ప్రభుత్వాలను కూకటి వేళ్ళతో కూలుస్తారని అన్నారు సుప్రీంకోర్టులో దాడికి పాల్పడ్డ న్యాయవాది రాకేష్ కిషోర్ ను అరెస్టు చేయడం మూడు గంటల్లో విడుదల చేయమనేది హేయమైన చర్యని ఈ విధానం భారత దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి వర్తించాలని కోరారు ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఏకమై జరిగిన ఘటనకు వ్యతిరేకంగా రాజ్యాంగ పరిరక్షణకు పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో చింతల భాస్కర్, వైనాల సాంబయ్య, మొగ్గం సుమన్, అంకేశ్వర ఐలయ్య, అరికెళ్ల దేవయ్య, ప్రభాకర్, పైడి తదితరులు పాల్గొన్నారు…