
జనం న్యూస్ అక్టోబర్ 08 సంగారెడ్డి జిల్లా,
పటాన్చెరు నియోజకవర్గంలోని ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కొరడా రువ్వారు. అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలు, షాపులు, షెడ్లు, కాంపౌండ్ వాల్లు వంటి నిర్మాణాలపై బుధవారం ఉదయం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి టౌన్ ప్లానింగ్ అధికారి విశాల్ ఆధ్వర్యంలో జెసిబీలను వినియోగించి కూల్చివేత చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ — మున్సిపాలిటీ పరిధిలో ఎవరైనా చట్టవిరుద్ధంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు ముందుగా మున్సిపల్ కార్యాలయం ద్వారా భవన అనుమతులు తీసుకోవాలని, నియమ నిబంధనలకు లోబడే నిర్మాణాలు మాత్రమే అనుమతించబడతాయని తెలిపారు.ఇకపై ఇలాంటి అక్రమ నిర్మాణాలను ఏ విధంగానూ సహించబోమని కమిషనర్ మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశారు. కూల్చివేతలలో, టౌన్ ప్లానింగ్ అధికారి విశాల్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు
