
జనం న్యూస్ అక్టోబర్ 8 నడిగూడెం
మండల పరిధిలోని బృందావనపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఎల్ 35 లిఫ్ట్ చైర్మన్ సీనియర్ నాయకులు మండవ అంతయ్య మృతి బాధాకరమని కోదాడ వ్యవసాయం మార్కెట్ కమిటీ చైర్పర్ పర్సన్ వేపూరి తిరుపతమ్మ సుధీర్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందిన అంతయ్య మృతదేహంపై పూలమాలవేసి నివాళులర్పించారు.అనంతరం వారు మాట్లాడుతూ గ్రామ సర్పంచిగా గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని,ఎల్ 35 లిఫ్ట్ చైర్మన్ గా రైతుల వ్యవసాయాన్ని నీళ్ల కొరకు ఎంతో శ్రమించారని ఆయన సేవలను కొనియాడారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శ్రీను, మండల ఉపాధ్యక్షులు దున్న శ్రీను,గోసుల రాజేష్,గ్రామ శాఖ అధ్యక్షుడు బొడ్డు గోవర్ధన్, విజయ రామారావు,మాధవరావు, కాంపాటి శ్రీను, చైతన్య,బాణాల నాగరాజు,పుట్ట రమేష్,పుట్ట చంద్రయ్య,రేపాల పురుషోత్తం, చిరంజీవి,శ్రీను, పుట్ట శ్రీను, కాసాని శ్రీను తదితరులు నివాళులర్పించారు.