
జనం న్యూస్ అక్టోబర్ 8 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ముమ్మిడివరం మండలం చిన కొత్తలంక గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆధ్వర్యంలో విజయదశమి ఉత్సవం జరిగింది. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు దేశ రక్షణ కోసం సైనికుల్లా ముందుంటారని, దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం ప్రణంగా పెట్టి ముందుకు వెళ్తారని ముఖ్యఅతిథిగా విచ్చేసిన శ్రీ పొత్తూరి మూర్తి రాజు ప్రశంసించారు. మరో ముఖ్య అతిథి శ్రీ కొడమర్తి రామ భాస్కర వెంకటరత్న శర్మ మాట్లాడుతూ వ్యక్తి నిర్మాణం ద్వారా, దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యం అని అన్నారు. 1925లో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్, 2025 విజయదశమి కి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందని,ఆర్ఎస్ఎస్ సమాజాన్ని సంఘటిత పరచి, సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చి ప్రతి వ్యక్తిలో దేశభక్తి భావనను నింపి తద్వారా ఈ దేశాన్ని ‘విశ్వ గురువు’గా నిలబెట్టడానికి మనమందరం మనవంతు కృషిని సల్పుతూ కలసి పనిచేద్దాం ఆర్ఎస్ఎస్ ఉమ్మడి జిల్లా కార్యకారిణి సభ్యులు నండూరి కృష్ణ పిలుపునిచ్చారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో గృహ సంపర్కం, హిందూ సమ్మేళనాలు, సద్భావన సమావేశాలు, ప్రతిష్టతవ్యక్తుల సమావేశాలు,శాఖలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో
ముమ్మిడివరం ఖండ సంఘ్ చాలక్ పెన్మెత్స గోపాల కృష్ణంరాజు, పొత్తూరి వీర వెంకట సత్యనారాయణ మూర్తి రాజు, కొడమర్తి రామ భాస్కర వెంకటరత్న శర్మ, ఖండ కార్యవాహ నంద్యాల నరసింహస్వామి, పొత్తూరి సత్యనారాయణ రాజు, కుడిపూడి దుర్గాప్రసాద్,ఆర్ఎస్ఎస్ జిల్లా గ్రామీణ వికాస్ సంయోజక్ సలాది శ్రీనివాసరావు, సమరసతా సేవా ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ బొంతు కనకారావు, రెడ్డి రామకృష్ణ,ఏలూరి రాంబాబు, కర్రి అన్నవరం, పితాని రామచంద్రరావు మరియు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు తదితరులు పాల్గొన్నారు.
