
జనం న్యూస్ అక్టోబర్ 09 నడిగూడెం
సోషల్ మీడియా వేదికగా తప్పుడు పోస్టులు పెడుతూ అసత్య ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు చేసేవారిని ఉపేక్షించబోమని ఎస్సై జి.అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఇతరులను కించపరిచే విధంగా పోస్టులు, ఫోటోలు, వీడియోలు, వాట్సాప్ స్టేటస్ ద్వారా షేర్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏ పోస్టునైనా షేర్ చేసే ముందు దాని విశ్వసనీయతను పరిశీలించాలని, చట్టాన్ని అతిక్రమించవద్దని ఆయన సూచించారు.