
జనం న్యూస్ ;9 అక్టోబర్ గురువారం;సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియన్ లాంగ్వేజ్స్ మైసూర్ వారి భరతవాని ప్రాజెక్ట్ లో భాగంగా సిద్దిపేటకు చెందిన బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం రచించిన పసిడి వెన్నెల, బాలకథా మంజూష,బాలకథా కౌముది, బాలకథా దీపిక, నాలుగు పుస్తకాలలోని కథలు ఆన్లైన్లో ప్రదర్శించడం పట్ల రచయిత ఉండ్రాళ్ళ రాజేశం సంతోషం వ్యక్తం చేశారు. ఇట్టి కథలన్ని కూడా ఆడియో రూపంలో అందించడం జరిగింది. నీతి న్యాయంతో కూడిన బాలల కథల సంపుటాలు జాతీయస్థాయి ఇండియన్ లాంగ్వేజ్ లలో చోటు దక్కేలా, పొందుపరిచినందుకు భరతవాని ప్రాజెక్ట్ నిర్వాహకులకు రాజేశం కృతజ్ఞతలు తెలిపారు. బాలసాహిత్యంలో విశేషకృషి చేస్తున్న ఉండ్రాళ్ళ రాజేశంను సిద్దిపేట కవులు ఆనందించారు.