
జనం న్యూస్ అక్టోబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించడం వల్లవ్యాపారులకు,కొనుగోలుదారులకు సౌలభ్యం ఏర్పడిందని జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. కాట్రేనికోనలో శుక్రవారం సాయి హోమ్ నీడ్స్ వద్ద కొనుగోలుదారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జీఎస్టీ తగ్గింపు పై కొనుగోలుదారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు జిఎస్టి పై సామాన్యులకు వివరిస్తున్న విధానం బాగుందన్నారు. వ్యాపారులకు, కొనుగోలుదారులకు మంచి సౌలభ్యం ఏర్పడిందని, 28% నుండి 18 శాతం వరకు, 12 శాతం నుండి ఐదు శాతం వరకు, మరికొన్ని వస్తువులపై జీరో పర్సంటేజ్ జీఎస్టీ తగ్గింపు జరిగిందనిబిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిఎస్టి ఓ భక్తవత్సలం, శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ టాక్స్ అసిస్టెంట్ హేమ సుందర్, వ్యాపారస్తులు, కొనుగోలుదారులు ఎంపీడీవో స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు
