
జనం న్యూస్ అక్టోబర్ 10 కుకట్పల్లి శ్రీనివాసరెడ్డి
ఫతేనగర్ డివిజన్లో శివాలయంలో శుక్రవారం దత్తాత్రేయ హోమం కాంగ్రెస్ నాయకుడు నరసింహ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టిపిసిసి ఉపాధ్యక్షుడు మరియు జహీరాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ &కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు .హోమ క్రతువులో పాల్గొన్నారు.అనంతరం భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ మహాదేవుడు, దత్తాత్రేయ కృపతో ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, వరహాల స్వామి, మధురి రామ్, అరుణ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
