
జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట అక్టోబర్ 10 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
చిలకలూరిపేట ప్రముఖ ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ శ్రీ దత్త సాయి అన్నదాన సమాజం మరియు జయ జయ సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ శిరిడి సాయి సమాజ్ వారు నిర్వహించే ప్రతి నెలలో నిర్వహించే శ్రీ సాయి తత్వ ప్రచార కార్యక్రమంలో భాగంగా పలువురు అధికారులను, సాయి భక్తులను, జిల్లా ప్రముఖులను కలవడం జరుగుతా ఉంది, ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పల్నాడు జిల్లా నూతనముగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కృత్తికా శుక్లా ని మరియు జాయింట్ కలెక్టర్ శ్రీ సూరజ్ గనోరే ధనంజయ ని మర్యాదపూర్వకంగా కలిసి షిరిడీ నుంచి తెచ్చిన సాయి వస్త్రమును శ్రీ దత్త సాయి చిత్రపటమును వారికి అందించి ట్రస్ట్ చేస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవా కార్యక్రమాలను వివరించడం జరిగింది, కలెక్టర్ మాట్లాడుతూ ఫస్ట్ ద్వారా ప్రజలకు మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు చేయాలని, మంచి సేవా కార్యక్రమాలకు ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేశారు, ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పూసపాటి బాలాజీ, ట్రస్ట్ గౌరవ సలహాదారులు పావులూరు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు